: తిరుమల వెంకన్న లడ్డూ నాణ్యత పెంపు


తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు నాణ్యత పెంచాలని తీర్మానించారు. ఇవాళ జరిగిన టీటీడీ పాలక మండలి సమావేశంలో దీంతో పాటు పలు నిర్ణయాలు తీసుకున్నామని టీటీడీ ఛైర్మన్ కనుమూరి బాపిరాజు తెలిపారు. లడ్డూ తయారీ కోసం ఎనిమిది లక్షల క్వింటాళ్లకు పైగానే ఆవునెయ్యి, రవ్వ కొనుగోలు చేయాలని నిర్ణయించారు. శ్రీగంధం తోటల పెంపకానికి ఐదు కోట్ల రూపాయలను కేటాయించారు. హైదరాబాదులోని బంజారాహిల్స్ టీటీడీ స్థలంలో రూ. 25 కోట్లతో గణపతి, వేంకటేశ్వరస్వామి ఆలయాలు నిర్మించాలని నిర్ణయించారు. అలాగే అక్కడ శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ప్రాంతీయ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 2014 జనవరి 11వ తేదీ (వైకుంఠ ఏకాదశి) నుంచి అన్ని టీటీడీ సత్రాల్లో ఉచిత అన్నదాన పథకాన్ని ప్రారంభించనున్నామని బాపిరాజు చెప్పారు.

  • Loading...

More Telugu News