: తమిళనాడు గోల్డెన్ టెంపుల్ లో హీరోయిన్ త్రిష పూజలు
సినీ నటి త్రిష తమిళనాడులోని వేలూరు జిల్లా శ్రీపురం స్వర్ణ దేవాలయంలో నారాయణి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అభిషేకాలు చేశారు. అంతకుముందు తన తల్లితో కలిసి వచ్చిన త్రిషకు ఆలయ నిర్వాహకులు స్వాగతం పలికారు. అనంతరం పీఠంలో డెబ్బై కిలోల బంగారంతో తయారుచేసిన శ్రీ స్వర్ణలక్ష్మీ విగ్రహానికి కూడా త్రిష చేత అభిషేకం చేయించారు. ఆలయ అధికారులు అమ్మవారి ప్రసాదాలను ఆమెకు అందజేశారు. దాదాపు రెండు గంటల పాటు త్రిష ఆలయంలో ఉన్నారు.