: స్వలింగ సంపర్కం ప్రకృతి విరుద్ధం: రాజ్ నాథ్ సింగ్
స్వలింగ సంపర్కం చట్ట విరుద్ధమన్న సుప్రీంకోర్టు తీర్పుపై బీజేపీ తొలిసారి తన అభిప్రాయాన్ని వెలిబుచ్చింది. స్వలింగ సంపర్కం ప్రకృతి విరుద్ధమని... దాన్ని తామెన్నటికీ సమర్థించమని బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ కుండబద్దలు కొట్టారు. స్వలింగ సంపర్కాన్ని వ్యతిరేకించే సెక్షన్ 377ను బీజేపీ బలంగా సమర్థిస్తుందని తెలిపారు. సోనియా, రాహుల్ సహా కాంగ్రెస్ జాతీయ నేతలంతా స్వలింగ సంపర్కంపై సుప్రీంకోర్టు నిర్ణయాన్ని వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా, సుప్రీం నిర్ణయంపై బీజేపీ తన వైఖరిని వెల్లడించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. సెక్షన్ 377ను మార్చడానికి పార్లమెంటులో బిల్లు ప్రవేశపెడితే, దాన్ని బీజేపీ అడ్డుకుంటుందని ఆ పార్టీ సీనియర్ నేత యోగి ఆదిత్యనాథ్ హెచ్చరించారు.