: కాంగ్రెస్ పార్టీకి ఏడు కన్నా తక్కువ సీట్లొస్తే రాజీనామా చేస్తా: తరుణ్ గొగోయ్


రానున్న లోక్ సభ ఎన్నికల్లో తమ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఏడు కంటే తక్కువ సీట్లు వస్తే తన పదవికి రాజీనామా చేస్తానని అసోం ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ సవాలు చేశారు. గౌహతీలో ఆయన మాట్లాడుతూ, రానున్న ఎన్నికల్లో ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ కున్న 7 లోక్ సభ స్థానాల కంటే తక్కువ వస్తే తాను పదవి నుంచి తప్పుకుంటానన్నారు. అసోం రాష్ట్రానికి తరుణ్ గొగోయ్ 2001 నుంచి నేటి వరకు ముఖ్యమంత్రిగా సేవలందిస్తున్నారు.

రానున్న ఎన్నికల్లో అఖిల భారత ఐక్యప్రజాస్వామ్య కూటమి(ఏఐయూడీఎఫ్) తో పొత్తు పెట్టుకునేందుకు నిర్ణయించారని తెలిపారు. ఈ విషయాన్ని ఇప్పటికే ఏఐసీసీ దృష్టికి తీసుకెళ్లినట్టు వివరించారు. అయితే పొత్తుల విషయంలో ఏఐసీసీదే అంతిమ నిర్ణయం అన్నారు. ఆ పార్టీ చీఫ్ బద్రుద్దీన్ తో తాము ఇప్పటికే సంప్రదింపులు మొదలు పెట్టినట్టు గొగోయ్ తెలిపారు.

  • Loading...

More Telugu News