: జగ్గయ్యపేట రైల్వే అధికారుల బొగ్గు కుంభకోణం
కృష్ణా జిల్లా జగ్గయ్యపేట రైల్వే స్టేషన్ లో బొగ్గు కుంభకోణం చోటు చేసుకుంది. ఇక్కడ రైల్వే శాఖ నిల్వ ఉంచిన బొగ్గును నల్గొండ జిల్లా చౌటుప్పల్ పరిసరాల్లో ఉండే పరిశ్రమలకు అక్రమార్కులు తరలిస్తున్నారు. ఈ బొగ్గును ఏడు లారీల్లో ఎక్కించి, రైల్వే అధికారులే అక్రమంగా తరలించారని లారీ అసోసియేషన్ ఆరోపిస్తోంది. కాగా అధికారులు తరలించిన బొగ్గు విలువ ఆరు లక్షల రూపాయలు ఉంటుందని సమాచారం.