: తండ్రి అడుగుజాడల్లో నడుస్తా.. కానీ అనుకరించను: డిగ్గీ రాజా కుమారుడు


తాను తండ్రిని అనుకరించను అంటున్నాడీ యువ నేత.. అలా అని ఆయనతో విభేదించను, కానీ ఆయన అడుగుజాడల్లో నడుస్తానంటున్నాడు మన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పర్యవేక్షకుడైన దిగ్విజయ్ సుపుత్రుడు జైవర్థన్ సింగ్. ఇటీవలే ఆయన రాఘవ్ గఢ్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించి మధ్యప్రదేశ్ శాసనసభలో అడుగుపెడుతున్నాడు. దిగ్విజయ్ మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసినా.. ఆయనను అనుకరించనని వినమ్రంగా చెప్పాడు. తనకంటూ ప్రత్యేక శైలిని ఏర్పరుచుకుంటానంటున్నాడు. ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తూ.. వారి అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడతానని విన్నవించాడు. అయితే, అందుకోసం దిగ్విజయ్ సింగ్ సూచనలను మాత్రం పాటిస్తానన్నాడు. ఇచ్చిన హామీలను నెరవేర్చి.. జైవర్థన్ సింగ్ యువతరానికి ఆదర్శంగా ఉంటాడని ఆశిద్దాం.

  • Loading...

More Telugu News