: సింగపూర్ లో మరో ఇద్దరు భారతీయుల అరెస్ట్
డిసెంబర్ 8వ తేదీన సింగపూర్ లోని లిటిల్ ఇండియా రేస్ కోర్స్ రోడ్డు ప్రాంతంలో జరిగిన అల్లర్లకు సంబంధించి ఈ రోజు మరో ఇద్దరు భారతీయులను అరెస్ట్ చేశారు. దీంతో ఈ ఆందోళనలకు సంబంధించి ఇప్పటిదాకా అరెస్టైన భారతీయుల సంఖ్య 33కు చేరుకుంది. వీరి మీద నేరారోపణలు రుజువైతే గరిష్ఠంగా ఏడేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది.
డిసెంబరు 8న రేస్ కోర్సు రోడ్డులో ఒక భారతీయుడిని ఓ ప్రైవేట్ బస్సు ఢీకొనడంతో అక్కడి భారతీయుల్లో ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకున్నాయి. వందలాది మంది రోడ్లమీదకొచ్చి దాడులకు పాల్పడ్డారు. ఈ అల్లర్లలో దాదాపు 40 మంది పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. అంతే కాకుండా 25 వాహనాలు ధ్వంసమయ్యాయి. వీటిలో 16 పోలీసు వాహనాలున్నాయి. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే సింగపూర్ లో 1969లో ఈ స్థాయి అల్లర్లు జరిగాయి.