: గవర్నర్ తో దిగ్విజయ్ ఏ హోదాలో విభజన గురించి చర్చించారు?: గాలి సూటి ప్రశ్న
ఏ హోదాలో గవర్నర్ నరసింహన్ తో దిగ్విజయ్ సింగ్ రాష్ట్ర విభజనపై చర్చించారని టీడీపీ నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు సూటిగా ప్రశ్నించారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ దిగ్విజయ్ సింగ్ ఆంధ్రపదేశ్ శాసనసభ గౌరవాన్ని కించపరిచారని అన్నారు. గవర్నర్ పదవి పరిధి దాటి ప్రవర్తిస్తున్నారని ఆయన విమర్శించారు. సమైక్య వాదినని చెప్పుకుంటున్న బొత్స సత్యనారాయణ విభజన వాదాన్ని వినిపిస్తున్న దిగ్విజయ్ కు విందు ఇవ్వడం వెనుక ఉద్దేశ్యం ఏంటని నిలదీశారు. అసలు శాసనసభలో ఓటింగ్ లేదని చెప్పడానికి దిగ్విజయ్ సింగ్ ఎవరని ఆయన మండిపడ్డారు. జగన్ తమ డీఎన్ఏ అంటూ వైఎస్సార్సీపీతో పొత్తు విషయాన్ని దిగ్విజయ్ మరోసారి స్పష్టం చేశారని గాలి తెలిపారు.