: జగన్ కు బీహార్ సీఎం నితీశ్ బాసట


కేంద్ర ప్రభుత్వం అడ్డగోలు విభజనను అడ్డుకునే చర్యల్లో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి నిన్న బీహార్ సీఎం నితీశ్ కుమార్ తో పాట్నాలో భేటీ అయ్యారు. రాష్ట్రాన్ని సంప్రదించకుండానే కేంద్రం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని నితీశ్ కు జగన్ ఫిర్యాదు చేశారు. పాట్నాలోని ఎనే మార్గ్ లో నితీశ్ నివాసంలో గంటపాటు సమావేశమైన తర్వాత జగన్ విలేకరులతో మాట్లాడారు. కేంద్రం అనుసరిస్తున్న తీరుకు వ్యతిరేకంగా నితీశ్ కుమార్ మద్దతు కోసం వచ్చానని చెప్పారు.

కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యూపీఏ సర్కారు 272 ఎంపీల బలంతో ఏ రాష్ట్రాన్ని అయినా ముక్కలు చేయగలనని అనుకుంటోందన్నారు. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 3కి వ్యతిరేకమన్నారు. ఇది చాలా ప్రమాదకరమైన ధోరణి అంటూ వ్యాఖ్యానించారు. జగన్ వెంట పార్టీ ఎంపీలు మేకపాటి రాజమోహన్ రెడ్డి, ఎస్పీవై రెడ్డి కూడా ఉన్నారు.

నితీశ్ కుమార్ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ విభజన విషయంలో కేంద్ర ప్రభుత్వం ఆ రాష్ట్రాన్ని సంపద్రించడం లేదన్న కీలకమైన అంశాన్ని జగన్ ప్రస్తావించారని చెప్పారు. సాధారణ మెజారిటీతో రాష్ట్రాన్ని ఏర్పాటు చేసే వెసులుబాటు రాజ్యాంగం ఇచ్చినా అది దేశ ప్రజాస్వామ్య విధానానికి వ్యతిరేకమన్నారు. ఆర్టికల్ 3 దుర్వినియోగాన్ని వ్యతిరేకించే విషయమై పార్టీలో చర్చిస్తానని తెలిపారు.

  • Loading...

More Telugu News