: రాజేంద్రనగర్ పరిధిలోని టాటానగర్ లో అక్రమ నిర్మాణాల కూల్చివేత


హైదరాబాదు మహానగర పరిధిలోని రాజేంద్రనగర్, టాటానగర్ లో అనుమతి లేకుండా నిర్మించిన అక్రమ నిర్మాణాలను ఇవాళ ఉదయం జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేశారు. ప్రభుత్వ భూముల్లో స్థానికులు ప్రభుత్వ అనుమతి తీసుకోకుండా నివాసాలు నిర్మించుకోగా.. మరికొంతమంది ఏకంగా ప్లాస్టిక్ గోదాములనే ఏర్పాటు చేసుకున్నారు. అనుమతి లేకుండా నిర్మించారంటూ ప్రభుత్వ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేసి, కూల్చివేతలు చేపట్టారు. అయితే, కొంత మంది న్యాయస్థానానికి వెళ్లి స్టే తెచ్చుకోవడంతో 27 ప్లాస్టిక్ గోదాములను మాత్రమే కూల్చివేయడం జరిగింది.

  • Loading...

More Telugu News