: జైల్లో సంజయ్ దత్ కు బీరు, రమ్ము?
ప్రముఖ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ 1993 ముంబై బాంబు పేలుళ్ల కేసులో పూణె ఎరవాడ జైల్లో శిక్షను అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. అయితే జైల్లో సంజయ్ దత్ కు జైలు సిబ్బంది బీరు, రమ్ములాంటి మద్యపానీయాల్ని సరఫరా చేస్తున్నారని మహరాష్ట్ర కౌన్సిల్ లో బీజేపీ నేత వినోద్ తావ్ డే ఫిర్యాదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా కాసులకు కక్కుర్తి పడిన జైలు అధికారులు సంజయ్ దత్ కు సహకరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాక మహారాష్ట్రలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని... లైంగిక వేధింపులు, అత్యాచారాలు పెరిగిపోయాయని విమర్శించారు.