: కన్నకూతురిపై పెట్రోలు పోసి నిప్పంటించిన తండ్రి
కొడుకు పుట్టలేదన్న కోపంతో కన్న కూతురుపైనే పెట్రోలు పోసి నిప్పంటించాడో కసాయి తండ్రి. ఈ దారుణ ఘటన కర్నూలు జిల్లా దాచేపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. ఈ ఘటనలో బాలిక శరీరం దాదాపుగా కాలిపోయింది. దారుణాన్ని గమనించిన స్థానికులు ఆ చిన్నారిని వెంటనే దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం వెంటనే కర్నూలు ఆసుపత్రికి తరలించాలని అక్కడి వైద్యులు చెప్పడంతో... ఆ చిన్నారిని కర్నూలుకు తరలించారు. ప్రస్తుతం ఆ బాలిక పరిస్థితి విషమంగా ఉందంటూ వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, పరారీలో ఉన్న ఆ కసాయి తండ్రి కోసం గాలిస్తున్నారు.