: ‘మధుమతి’ హాట్ సీన్లలో నన్ను మార్ఫింగ్ చేశారు: నటి ఉదయభాను
మధుమతి సినిమాలో హీరోయిన్ గా నటించిన ఉదయభాను ఆ సినీ నిర్మాత, దర్శకుడిపై విరుచుకుపడింది. సినిమాలోని హాట్ సీన్లలో తనను మార్ఫింగ్ చేశారని ఆరోపిస్తూ గత రాత్రి బంజారాహిల్స్ పోలీస్ స్టేషనులో ఫిర్యాదు చేసింది. సినిమా సన్నివేశాలపై కొన్ని అనుమానాలున్నాయని ఆరోపించింది. తనకు సినిమా చూపించకుండా అడిగితే.. కనీసం ప్రివ్యూ కూడా చూపించలేదని వాపోయింది. దీంతో పోలీసులు, మా అధ్యక్షులు తమ్మారెడ్డి భరద్వాజా సమక్షంలో మధుమతి సినిమాను వీక్షించింది.
ప్రివ్యూ చూసిన తర్వాత ఉదయభాను మీడియాతో మాట్లాడుతూ.. సినిమాలో తనకు ముందుగా చెప్పిన సన్నివేశాలు లేవని చెప్పింది. ఏవేవో పాత్రలు వచ్చి చేరాయని, వాటి వల్ల ప్రేక్షకులు సినిమాకు వచ్చే అవకాశం లేదని అన్నారు. అయితే సినిమాలో తాను అనుకున్నవి లేవని ఆమె వ్యాఖ్యానించింది.
తన విషయంలో కొన్ని పత్రికలు, వెబ్ సైట్లు రకరకాలుగా కథనాలు రాస్తూ ప్రచారం చేస్తున్నాయని, అయితే వాటిపై తాను స్పందించాల్సిన అవసరం లేదని చెప్పింది. తనను ప్రతి టీవీ ఛానెల్ ఇంటర్వ్యూ ఇవ్వాలని కోరుతున్నా.. తాను మాత్రం ఇంటర్వ్యూలు ఇవ్వనని తేల్చి చెప్పింది. ఇలాంటి రాతలు చూసిన ప్రతిసారి తన పేరు వాడుకుంటున్నందుకు బాధగా ఉంటోందని మీడియా ముందు ఉదయభాను కన్నీరు పెట్టుకుంది.