: కాంగ్రెస్ ఇక మూడు నెలల్లో ఇంటికే: చంద్రబాబు
కాంగ్రెస్ పార్టీ మరో మూడు నెలల్లో దుకాణం మూసేసి ఇంటికి వెళ్లడం ఖాయమని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తెలిపారు. హైదరాబాదులోని తన నివాసం నుంచి మాట్లాడుతూ, ఐసీయూలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి వెంటిలేటర్ తీసేస్తే ప్రాణం పోతుందని, అలాంటి కాంగ్రెస్ పార్టీ తెలుగు జాతి మధ్య విద్వేషాలు రేపడం మంచిదా? అని ఆయన ప్రశ్నించారు. విభజన అని అంటున్న నాటి నుంచి తాము కొన్ని సూచనలు చేస్తున్నామని, ఆల్ పార్టీ మీటింగ్ పెట్టండని సూచించామని అన్నారు. ఇరు ప్రాంతాల జేఏసీలతో చర్చించి సమస్యలు పరిష్కరించండి అని చాలాసార్లు సూచించిన సంగతిని బాబు గుర్తు చేశారు.