: ఇదేనా రాజ్యాంగబద్ధం అంటే?: డిగ్గీ రాజాకు బాబు సూటి ప్రశ్న


"దిగ్విజయ్ సింగ్ కానీ, మిగిలిన కాంగ్రెస్ నేతలు కానీ పదే పదే రాజ్యాంగ బద్ధంగా కొత్త రాష్ట్రం ఏర్పాటు జరుగుతోందంటున్నారు, సమస్యలు పరిష్కరించామని అంటున్నారు. వీరిని చూస్తుంటే రాజ్యాంగం వీరికి తెలుసా? అని డౌటు వస్తోంది" అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. రాజ్యాంగం మొత్తం తిరగేసినా ఉమ్మడి రాజధాని అనే పదం దొరకదని గుర్తు చేశారు. ఉమ్మడి రాజధానిలో గవర్నర్ పరిపాలిస్తాడని ఎక్కడ రాసి ఉందో తనకు చూపించాలని కోరారు.

రాష్ట్రం ఒక చోట వుంటే, మరో రాష్ట్ర రాజధాని నుంచి పరిపాలన ఎలా కొనసాగుతుందో తెలపాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే ఆర్టికల్ 3, ఆర్టికల్ 370, ఆర్టికల్ 371 డీ సవరణలు చేయాలని సాక్షాత్తూ అటార్నీ జనరలే సూచించాడని గుర్తుచేశారు. అలాంటిది కాంగ్రెస్ నేతలు కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ రాజ్యాంగ బద్ధంగా విభజన జరుగుతోందని ఎలా చెప్తారని చంద్రబాబు నాయుడు నిలదీశారు.

  • Loading...

More Telugu News