: దూకుడు ప్రదర్శిస్తున్న బాబు
వచ్చే ఎన్నికల విషయంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఆరు నెలల ముందే అభ్యర్ధులను ప్రకటిస్తామంటూ ప్రత్యర్దులకు సవాల్ విసిరారు. ప్రస్తుతం పశ్చిమగోదావరి జిల్లాలో పాదయాత్ర చేస్తున్న బాబు ఈరోజు పెద అమిరం వద్ద కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఎన్నికలు వస్తే ఎలా సన్నద్ధమవ్వాలో బాబు వారికి ఉద్బోధించారు.
కష్టాలు తీరాలంటే మరొక్క ఏడాది శ్రమిస్తే చాలని బాబు వారిలో ఆత్మవిశ్వాసం నూరిపోశారు. కాంగ్రెస్, వైఎస్సార్సీపీలను తోడుదొంగలుగా పేర్కొన్న బాబు, ప్రత్యర్థి పార్టీల కుయుక్తులను దీటుగా ఎదుర్కోవాలని పలికారు. అన్నివర్గాలకు పార్టీలో సమప్రాధాన్యత ఉంటుందని బాబు ఈ సందర్బంగా భరోసా ఇచ్చారు.