: రేపు ఫేస్ బుక్ అభిమానుల వేదిక ఆధ్వర్యంలో ‘ఉషశ్రీ ఉభయకుశలోపరి‘


ఫేస్ బుక్ స్నేహితులు, ఆత్మీయులనే కాదు.. అభిమానులనూ కలుపుతోంది. తాజాగా ఫేస్ బుక్ లో ఏర్పడిన ‘ఉషశ్రీ అభిమానుల వేదిక’ రేపు సికింద్రాబాదులో ‘ఉషశ్రీ ఉభయకుశలోపరి’ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. రేపు సాయంత్రం 6గంటలకు ప్యారడైజ్ సమీపాన గల సన్ షైన్ ఆసుపత్రి 3వ అంతస్తులోని శాంతా ఆడిటోరియంలో ఈ కార్యక్రమం జరుగనుందని ఓ ప్రకటనలో తెలిపింది. ఇందులో సినీ ప్రముఖులు కూడా పాల్గొని ప్రసంగించనున్నారని ఫేస్ బుక్ లో కార్యక్రమ వివరాలను వెల్లడించింది. విజయవాడ ఆలిండియా రేడియో కేంద్రంలో 1970-80 దశకాల్లో ఉషశ్రీ భారత, రామాయణాల గురించి అద్భుతమైన వ్యాఖ్యానాలను అందించేవారు. తన గంభీరమైన కంఠస్వరంతో రేడియో శ్రోతలను కట్టిపడేసే వారు. దశాబ్దాలు గడిచినా ఆయన వ్యాఖ్యానాల మీద ఉన్న అభిమానం తరగలేదనడానికి ఈ కార్యక్రమమే ఉదాహరణ.

  • Loading...

More Telugu News