: బంగ్లాదేశ్ జమాత్ ఇస్లామీ నేతకు ఉరిశిక్ష
బంగ్లాదేశ్ జమాత్ ఇస్లామీ నేత అబ్దుల్ ఖాదర్ మొల్లా(65)కు గతరాత్రి (గురువారం)10.1 నిమిషాలకు ఉరిశిక్ష అమలు చేశారు. ఈ విషయాన్ని ఢాకా కేంద్ర కారాగారం బయట ఓ అధికారి వెల్లడించారు. అంతకుముందు కుటుంబసభ్యులు ఆయనను చివరిసారి కలిశాక ఆ వెంటనే శిక్షను అమలు చేశారు. 1971 బంగ్లాదేశ్ విముక్తి యుద్ధం సందర్భంగా హత్యాకాండకు పాల్పడిన నేరానికి అబ్దుల్ ఖాదర్ ను ఉరి తీశారు. ఇలాంటి నేరాల్లో ఉరిశిక్ష పడ్డ తొలి రాజకీయ నేత ఆయనే.