: సీడబ్ల్యూసీ నిర్ణయాన్ని సీఎం అయినా పాటించాల్సిందే: దిగ్విజయ్ సింగ్
రాష్ట్ర విభజనకు సంబంధించి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) నిర్ణయమే అంతిమమని దిగ్విజయ్ సింగ్ కుండబద్దలు కొట్టారు. సీడబ్ల్యూసీ నిర్ణయాన్ని ముఖ్యమంత్రి కూడా పాటించాల్సిందేనని స్పష్టం చెప్పారు. గాంధీభవన్ లో మీడియాతో మాట్లాడుతూ, ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భాగ్యనగరంలో నివసించే వారి భద్రతకు కేంద్ర ప్రభుత్వం హామీ ఇస్తుందని డిగ్గీ రాజా అన్నారు. దీనికితోడు, హైదరాబాద్ నగర పరిధిలోని సీమాంధ్రుల ఆస్తులు, ఉద్యోగాలకు పూర్తి భద్రత కల్పిస్తామన్నారు. అందుకే నగర శాంతిభద్రతలను కేంద్రం తన ఆధీనంలోకి తీసుకోబోతోందని ఆయన స్పష్టం చేశారు. గోదావరి, కృష్ణా నదీజలాల విషయాన్ని ప్రత్యేక బోర్డులు చూసుకుంటాయని తెలిపారు.