: బిల్లుపై సభ్యులు అభిప్రాయాలు తెలపడమే కాని ఓటింగ్ ఉండదు: దిగ్విజయ్ సింగ్


విభజన బిల్లు అసెంబ్లీకి వచ్చిందని... శాసనసభలో ఎప్పుడు ప్రవేశపెట్టాలనే అంశంపై బీసీఏ సోమవారం నిర్ణయం తీసుకుంటుందని దిగ్విజయ్ సింగ్ స్పష్టం చేశారు. ముసాయిదా బిల్లు సభకు వచ్చిన తర్వాత సభ్యులందరూ తమ అభిప్రాయాలను తెలియజేయవచ్చని అన్నారు. అంతేకాని తీర్మానంపై ఓటింగ్ ఉండదని తెలిపారు. బిల్లు ముసాయిదాలోని ప్రతి క్లాజ్ పై చర్చ ఉంటుందని చెప్పారు. గాంధీ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో రాష్ట్ర విభజనకు అంగీకరించిన టీడీపీ, వైఎస్సార్సీపీలు యూటర్న్ తీసుకున్నాయని విమర్శించారు. ప్రస్తుతం ఏకాభిప్రాయం కుదరటంలేదంటూ ఈ రెండు పార్టీలు రాద్ధాంతం చేస్తున్నాయని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉందని ఆయన తెలిపారు.

జల వనరులు, శాంతి భద్రతలు, ఉమ్మడి రాజధాని, అభివృద్ధి తదితర అంశాలను కేంద్రం పరిశీలిస్తుందని, విభజన జరిగిన తర్వాత ఇరు ప్రాంతాలు అభివృద్ధి చెందేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని దిగ్విజయ్ చెప్పారు. పోలవరం నిర్మాణ బాధ్యతలను కేంద్ర ప్రభుత్వమే చూసుకుంటుందని ఆయన హామీ ఇచ్చారు. దేశంలో ఏ ప్రాంతం వారైనా, ఎక్కడైనా ఆస్తులు ఏర్పాటు చేసుకునే అవకాశాన్ని రాజ్యాంగం కల్పించిందని తెలిపారు.

  • Loading...

More Telugu News