: కేరళ,గుంటూరు అయ్యప్త భక్తుల మధ్య ఘర్షణ
శబరి ఎక్స్ ప్రెస్ రైలులో కేరళ, గుంటూరు అయ్యప్త భక్తుల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. ఎస్-10 బోగీలో ప్రయాణిస్తున్న గుంటూరు జిల్లా అయ్యప్ప భక్తులపై, కేరళ భక్తులు దాడి చేశారని.. దాంతో, ఇరువురి మధ్య తీవ్ర ఘర్షణ జరిగినట్లు తెలుస్తోంది. వెంటనే ఇద్దరు గుంటూరు జిల్లా భక్తులను కేరళ పోలీసులు అరెస్టు చేశారు. వారిని వదిలి పెట్టాలని మిగతా అయ్యప్ప భక్తులు రైలును కేరళలోని సోలూరు కూడలి వద్ద నిలిపివేశారని సమాచారం.