: సచివాలయంలో నిషేధాజ్ఞలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయ ఆవరణలో భద్రతా సిబ్బంది నిషేధాజ్ఞలు విధించారు. ఇవాళ అక్కడ సీమాంధ్ర, తెలంగాణ ప్రాంత ఉద్యోగులు పోటా పోటీగా నిరసన కార్యక్రమాలు నిర్వహించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారిన విషయం విదితమే. దాంతో భద్రతా సిబ్బంది రంగంలోకి దిగి పరిస్థితిని అదుపు చేశారు. దీనికితోడు... సచివాలయంలో సభలు, సమావేశాలు, ర్యాలీలు నిషేధించామని.. అలాగే మైకులు, డప్పు వాయిద్యాలు వాడకూడదంటూ పోలీసులు ఆదేశాలు జారీ చేశారు.