: మరోచోట బంగారం తవ్వకం కోసం కోర్టును ఆశ్రయించిన సాధువు!


సాధువు శోభన్ సర్కార్ కల ఆధారంగా రెండు నెలల కిందట ఉత్తరప్రదేశ్ లోని ఉన్నవ్ కోటలో బంగారం కోసం ప్రభుత్వం తవ్వకాలు జరిపిన సంగతి తెలిసిందే. ఇరవై రోజుల పాటు జరిపిన ఆ తవ్వకాల్లో ఏమీ బయటపడలేదని పురావస్తు శాఖ కూడా తెలిపింది. ఇదే విధంగా బంగారం కోసం ఫతేపూర్ లో తవ్వకాలు జరిపేందుకు అనుమతించాలని మళ్లీ ఆ సాధువే అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఆయన తరపు న్యాయవాది ఓ పిటిషన్ వేశారు. ఫతేపూర్ జిల్లాలోని అదమ్ పుర్ గ్రామంలో 2,500 టన్నుల బంగారం ఉందని పేర్కొన్నారు. వచ్చే వారం ఈ పిటిషన్ విచారణకు రానుంది. అయితే, ముందుగానే అక్కడ నిపుణులైన 'ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్' చేత సర్వే చేయించవచ్చని సాధువు న్యాయవాది తెలిపారు. ఈసారి తవ్వకాలకు ఖర్చులన్నీ భరించేందుకు సర్కార్ సిద్ధంగా ఉన్నారని న్యాయవాది చెప్పారు.

  • Loading...

More Telugu News