: కడియం శ్రీహరి కుమార్తె వివాహ వేడుకకు హాజరైన కేసీఆర్
ఇవాళ వరంగల్ జిల్లా హన్మకొండలో కడియం శ్రీహరి కుమార్తె వివాహ మహోత్సవం జరిగింది. ఈ వేడుకకు టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ హాజరయ్యారు. ఆ తరువాత వరంగల్ జిల్లా నాయకులతో కేసీఆర్ సమావేశమయ్యారు. తెలంగాణ ప్రజలు ప్రత్యేక రాష్ట్రం కోసం కన్న కలలు నేడు సాకారమవుతున్నాయన్నారు. ఇంతకు ముందే ప్రకటించినట్టు.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పూర్తి కాగానే ఇక్కడి ప్రభుత్వ ఉద్యోగులకు భారీ వేతనాలు చెల్లిస్తామని ఆయన తెలిపారు.