: కేజ్రీవాల్ పై రిటైర్డ్ ఆర్మీ చీఫ్ పరోక్ష వ్యాఖ్యలు!
జనలోక్ పాల్ బిల్లు కోసం అన్నా హజారే చేపట్టిన నిరాహారదీక్షలో, రిటైర్డ్ ఆర్మీ చీఫ్ వీకే సింగ్ ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పై పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు అన్నా దీక్షలో సింగ్ ప్రసంగిస్తూ.. కొంతమంది అన్నా కంటే తామే చాలా గొప్పవారమని అనుకుంటున్నారని వ్యాఖ్యానించారు. ఆ మాటలకు అక్కడే ఉన్న ఏఏపీ నేత గోపాల్ రావ్ కోపోద్రిక్తుడై ప్రతిస్పందించేందుకు రెడీ అయ్యారు. వెంటనే ఆయనను అన్నా ఆపారు. అటు వీకే సింగ్ ప్రసంగాన్ని కొనసాగించాలని చెప్పారు. కాగా, ప్రసంగానికి అంతరాయం కలిగించాలని అనుకుంటే దీక్షా స్థలి నుంచి వెళ్లిపోవాలని గోపాల్ రావ్ కు అన్నా సూచించారు. ఈ చిన్నపాటి ఘటనతో అన్నాకు, కేజ్రీవాల్ కు పొరపొచ్చాలున్నాయా? అనే సందేహం రాకమానదు.