: కాంగ్రెస్ పార్టీకి పెద్దిరెడ్డి గుడ్ బై
సీనియర్ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. అన్నిపదవులకు రాజీనామా చేస్తున్నట్టు ఆయన ఈరోజు ప్రకటించారు. పెద్దిరెడ్డి ఇప్పటివరకు ఏఐసీసీ సభ్యుడిగాను, పీసీసీ ఉపాధ్యక్షుడిగానూ వ్యవహరించారు. కాగా, తన రాజీనామా లేఖను పీసీసీ చీఫ్ బొత్సకు, కాంగ్రెస్ అధినేత్రి సోనియాకు పంపారు. అయితే, సీఎం కిరణ్ తో విభేదాలే పెద్దిరెడ్డి రాజీనామాకు కారణమని తెలుస్తోంది.