: సీఎస్ ఓ పోస్ట్ మేన్ మాత్రమే.. ఆయనపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తాం: హరీష్ రావు
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) మహంతిపై టీఆర్ఎస్ నేత హరీష్ రావు మండిపడ్డారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేవలం ఒక పోస్ట్ మేన్ మాత్రమే అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నిన్న సాయంత్రం ప్రత్యేక విమానంలో విభజన బిల్లు ప్రతులు ఆయనకు చేరినా... ఇంతవరకు వాటిని అసెంబ్లీకి పంపలేదని విమర్శించారు. సీఎం అడుగులకు మడుగులు ఒత్తుతున్న సీఎస్ వాటిని తనవద్దే ఉంచుకున్నారని ఆరోపించారు. ఈ సాయంత్రం లోపు బిల్లు ప్రతులను అసెంబ్లీకి పంపకపోతే... ఆయనకు వ్యతిరేకంగా హక్కుల ఉల్లంఘన నోటీసులను స్పీకర్ కు ఇస్తామని హెచ్చరించారు. అంతే కాకుండా ఆయనపై రాష్ట్రపతికి కూడా ఫిర్యాదు చేస్తామని అన్నారు.