: ఇంకొకడ్ని పెళ్లి చేసుకుంటే ఆ ఫోటోలు ఫేస్ బుక్ లో పెడతా


ప్రేమ పైత్యం నెత్తికెక్కి, వేధింపులతో పాటు బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, విశాఖపట్నానికి చెందిన ఉదయ్(25) ఓ ప్రైవేటు చానెల్ లో విధులు నిర్వర్తిస్తూ హైదరాబాద్ బంజారాహిల్స్ లోని దేవరకొండ బస్తీలో నివాసం ఉంటున్నాడు. అదే ప్రాంతానికి చెందిన ఓ యువతితో ఏర్పడిన పరిచయం ప్రేమకు దారితీసింది.

ఈ క్రమంలో సదరు యువతికి పెళ్లి కుదిరింది. విషయం తెలుసుకున్న ఉదయ్ ఆమె ఇంటికి వెళ్లి తనను కాకుండా వేరొకరిని పెళ్లి చేసుకుంటే... తమ ఫోటోలు ఫేస్ బుక్ లో పెడతానని బెదిరింపులకు దిగాడు. దీంతో బాధిత యువతి పోలీసులను ఆశ్రయించింది. ఉదయ్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News