: కొన్ని షరతులతో లోక్ పాల్ బిల్లుకు మద్దతిస్తాం: బీజేపీ
కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యూపీఏ ప్రవేశపెడుతున్న లోక్ పాల్ బిల్లుకు కొన్ని సవరణలు, షరతులతో మద్దతిస్తామని బీజేపీ తెలిపింది. దీనిపై ఆ పార్టీ నేత ప్రకాశ్ జవదేకర్ మాట్లాడుతూ.. సవరణలతో కూడిన లోక్ పాల్ బిల్లును ప్రభుత్వం వెంటనే లోక్ సభలోకి తీసుకురావాలన్నారు. అంతేగాక సెలెక్ట్ కమిటీ చేసే సవరణలతో ఏకగ్రీవంగా ఆమోదించాలని పేర్కొన్నారు. కాగా, లోక్ పాల్ బిల్లును ఈ సమావేశాల్లోనే ప్రవేశపెడతామని పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రి కమల్ నాథ్ చెప్పిన సంగతి తెలిసిందే.