: విప్ జారీ చేసైనా బిల్లు గట్టెక్కిస్తారు: దానం


తెలంగాణ బిల్లును అసెంబ్లీలో గట్టెక్కించేందుకు అవరసరమైతే కాంగ్రెస్ పార్టీ విప్ జారీ చేస్తుందని మంత్రి దానం నాగేందర్ స్పష్టం చేశారు. హైదరాబాద్ లోని అసెంబ్లీ ఆవరణలో ఆయన మాట్లాడుతూ, ఈ సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలని తమ ప్రాంత నేతలంతా కోరుతున్నారని, ఒక వేళ వీలు కాకుంటే అప్పుడు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసైనా బిల్లు పాస్ చేస్తారని అన్నారు. హైదరాబాద్ పై జీవోఎం చేసిన సూచనలపై పలు అభ్యంతరాలను గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేటర్లు, నాయకులతో కలిసి దిగ్విజయ్ కు వివరిస్తానని దానం స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News