: 13 నుంచి బడ్జెట్ సమావేశాలు.. నిషేధాజ్ఞలు విధించిన పోలీస్ శాఖ


ఈ నెల 13 నుంచి రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవనున్న నేపథ్యంలో, అసెంబ్లీ చుట్టు పక్కల ప్రాంతాలలో నగర పోలీస్ శాఖ గట్టి భద్రత చేపట్టింది. శాసనసభ, శాసనమండలికి 2 కిలో మీటర్ల పరిధిలో ఎలాంటి సభలు, ప్రదర్శనలు నిర్వహించే వీలు లేకుండా నిషేధం విధిస్తున్నట్లు కమిషనర్ అనురాగ్ శర్మ తెలిపారు.

ఈ నిషేధాజ్ఞలు ఈ 13 నుంచి 19 వరకు అమలులో ఉంటాయని చెప్పారు. గత నెలలో చోటు చేసుకున్న దిల్ సుఖ్ నగర్ జంట పేలుళ్ల సంఘటన నేపథ్యంలో 
అసెంబ్లీ చుట్టుపక్కల ప్రాంతాల వారికి, శాసన సభ్యులకు భద్రత కల్పించాలని శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్  కోరారు.

  • Loading...

More Telugu News