: ఆసియాలో భారత కరెన్సీకే వాపు ఎక్కువ
ఆసియాలో భారత్ వృద్ధిపరంగా మూడో స్థానంలో ఉంది. కానీ, ద్రవ్య వాపు విషయంలో అగ్ర స్థానానికి చేరుకుంది. తాజాగా దేశంలో చిల్లర వర్తక ధరల ఆధారిత ద్రవ్యోల్బణం 11.20శాతానికి చేరుకుంది. దీంతో ఆసియాలోనే అత్యధిక ద్రవ్యోల్బణం కలిగిన దేశంగా భారత్ అపకీర్తి గడించింది. ప్రపంచంలో ద్రవ్యోల్బణం అత్యధికంగా ఉన్న నాలుగో దేశం ఇప్పుడు భారత్.
అందాల భామలకు చిరునామా అయిన వెనెజులాలో ద్రవ్యోల్బణం 54.3శాతం. ఇది ప్రపంచంలోనే అత్యధికం. బెలారస్ లో 15.3శాతం, ఈజిప్టులో 13 శాతం ఉంది. వీటి తర్వాత భారత్, తర్వాత పాక్ లో 10.9శాతం ఉంది. కరెన్సీ విలువ తరగడం, వస్తువుల ధరలు పెరగడాన్నే ద్రవ్యోల్బణంగా పేర్కొంటారు.