: పార్లమెంటు ఉభయసభలు ప్రారంభం
పార్లమెంటు ఉభయసభలు ప్రారంభమయ్యాయి. పార్లమెంటుపై దాడి జరిగి నేటికి పన్నెండేళ్లు కావడంతో.. దాడి ఘటనలో మృతి చెందిన జవాన్లకు లోక్ సభ, రాజ్యసభ సభ్యులు నివాళులర్పించారు. ఈ మేరకు కొద్దిసేపు మౌనం వహించి సంతాపం ప్రకటించారు. అటు వెంటనే ఛైర్మన్ హమీద్ అన్సారీ రాజ్యసభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు.