: అమెరికాలో భారత రాయబార సీనియర్ ఉద్యోగి అరెస్ట్
అమెరికాలోని న్యూయార్క్ లో భారత రాయబార కార్యాలయం డిప్యూటీ కౌన్సిల్ జనరల్ దేవయాని కోబ్రాగడే అరెస్టయ్యారు. వీసా మోసానికి పాల్పడినట్లు, తప్పుడు ప్రకటన ఇచ్చినట్లు ఆమెపై అభియోగాలు మోపారు. అనంతరం కోర్టులో హాజరు పరచగా 25వేల డాలర్ల బాండ్ సమర్పించడంతో కోర్టు విడుదల చేసింది. ఒక భారత ఉద్యోగి తరఫున దేవయాని మోసపూరిత పత్రాలను విదేశాంగ శాఖకు సమర్పించారని ఆరోపిస్తున్నారు. దీనిపై భారత రాయబార కార్యాలయం తన ఆందోళనను అమెరికాకు తెలియపరిచింది.