: గవర్నర్ ను కలిసిన దిగ్విజయ్


రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ రాజ్ భవన్ లో కలుసుకున్నారు. టీబిల్లు శాసనసభకు వచ్చిన నేపథ్యంలో, రెండు రోజుల హైదరాబాద్ పర్యటనలో ఉన్న డిగ్గీరాజా గవర్నర్ ను కలుసుకోవడం ఊహించిన పరిణామమే. రాష్ట్రంలోని ఇరు ప్రాంతాల్లో నెలకొన్న పరిస్థితులు, అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టడం తదితర అంశాలపై వారు చర్చిస్తున్నారు. అంతకు ముందు దిగ్విజయ్ తో లేక్ వ్యూ అతిథి గృహంలో పీసీసీ అధ్యక్షుడు బొత్స భేటీ అయ్యారు.

  • Loading...

More Telugu News