: తీవ్ర గందరగోళం మధ్య ప్రారంభమైన అసెంబ్లీ.. అరగంట వాయిదా
అసెంబ్లీ రెండో సమావేశాలు కొద్దిసేపటి క్రితం ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభం కాగానే తాము ఇచ్చిన వాయిదా తీర్మానాలపై చర్చించాలని తెలుగుదేశం, వైకాపా, బీజేపీ, సీపీఐ పార్టీలు పట్టుబట్టాయి. అయితే అన్ని పార్టీల వాయిదా తీర్మానాలను స్పీకర్ నాదెండ్ల తిరస్కరించారు. దీంతో సభలో గందరగోళం చెలరేగింది. సభ్యులందరూ స్పీకర్ పోడియంను చుట్టుముట్టారు. సభ జై సమైక్యాంధ్ర, జై తెలంగాణ నినాదాలతో మారుమోగింది. దీంతో, సభను అరగంట సేపు వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు.