: నేటి శాసనసభలో వివిధ పార్టీల వాయిదా తీర్మానాలు
నిన్న ప్రారంభమైన అసెంబ్లీ శీతాకాల సమావేశాలు... తొలి రోజు మండేలాతో పాటు, ఇతర నాయకుల మృతికి సంతాపం తెలిపిన అనంతరం వాయిదా పడ్డాయి. ఈ రోజు శాసన సభ సమావేశాలు మరికొద్ది సేపట్లో ప్రారంభంకానున్నాయి. ఈ రోజు సమావేశాల్లో వివిధ పార్టీల వాయిదా తీర్మానాలు సభ ముందుకు రాబోతున్నాయి. సమైక్యాంధ్ర, తెలంగాణ ఉద్యమాలకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిపై చర్చ కోసం తెదేపా వాయిదా తీర్మానం కోరింది. విభజన ముసాయిదా బిల్లుపై చర్చించాలంటూ టీఆర్ఎస్, బీజేపీ, సీపీఐ వాయిదా తీర్మానాన్ని కోరాయి. అలాగే సమైక్య తీర్మానం కోరుతూ వైకాపా స్పీకర్ కు నోటీసు ఇచ్చింది. తుపాను నష్టం, బాధితులకు పరిహారంపై సీపీఎం వాయిదా తీర్మానాన్ని కోరింది.