: కంటి చూపుతోనే చేరవేత


కంటి చూపుతో ఏం చేరవేస్తాం... ఏముంది, మనం చూసే దృశ్యాలకు సంబంధించిన చిత్రాలను మన మెదడుకు కంటిచూపు చేరవేస్తుంది అనుకుంటాం. కానీ మన స్మార్ట్‌ ఫోన్‌, కంప్యూటర్‌లోని ఫైళ్లను కేవలం మన కంటిచూపుతోనే అవతలి కంప్యూటర్లకి చేరవేయవచ్చట. మన కంటి చూపుతోనే ఇలాంటి పనులను చేసే విధంగా శాస్త్రవేత్తలు ప్రత్యేకమైన పరికరాలను తయారుచేస్తున్నారు. దీంతో మనకు కూడా కాస్త పనితగ్గుతోంది.

బ్రిటన్‌లోని లాన్‌కాస్టర్‌ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు ఒక కొత్త రకం టెక్నాలజీని తయారుచేశారు. దీనిద్వారా కంప్యూటర్‌లోని ఫైళ్లను మన కంటిచూపుతోనే స్మార్ట్‌ఫోన్‌ లేదా ట్యాబ్లెట్‌ లలోకి ట్రాన్స్‌ఫర్‌ చేయవచ్చని చెబుతున్నారు. ఈ కొత్తరకం టెక్నాలజీకి 'ఐ డ్రాప్‌' అనే పేరుపెట్టారు. అంటే మనం కంటిచూపు ద్వారా ఫైళ్లను వేరొక కంప్యూటర్‌లోకి డ్రాప్‌ చేయడం అన్నమాట. ఇలా డ్రాప్‌ చేయడానికి తలకు ఒక ప్రత్యేకమైన ఐ-ట్రాకర్‌ను ఉపయోగించాల్సి ఉంటుంది. దీనిద్వారా మనం కంటిచూపుతోనే ఫైళ్లని డ్రాప్‌ చేయవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News