: అడిగినంత ఇవ్వలేదని విధ్వంసం సృష్టించిన మావోయిస్టులు


తాము డిమాండ్ చేసిన మొత్తం (మావోలు లెవీ అని పిలుస్తారు) ఇవ్వలేదన్న ఆగ్రహంతో మావోయిస్టులు విధ్వంసం సృష్టించారు. బీహార్ శివ్ హరి జిల్లాలో ఓ వంతెన నిర్మిస్తున్న సంస్థను లెవీ ఇమ్మని 40 మంది మావోయిస్టులు వచ్చి అడిగారు. లెవీ ఇచ్చేందుకు సదరు సంస్థ నిరాకరించడంతో ఆగ్రహంతో సంస్థకు చెందిన ఐదు వాహనాలు, కార్మికుల కోసం నిర్మించిన ఇళ్లను తగులబెట్టేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మావోల కోసం గాలింపు చేపట్టామని ఎస్పీ హిమాంశుశంకర్ త్రివేది తెలిపారు.

  • Loading...

More Telugu News