: మళ్లీ అధ్యక్ష పగ్గాలను అశోక్ బాబు అందుకుంటారా?
హైదరాబాదులో ఏపీఎన్జీవో రాష్ట్ర కమిటీ ఎన్నికలు ఈ నెలాఖరులో జరిపేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. 22వ తేదీ మధ్యాహ్నం వరకు నగరంలోని ఎన్జీవో హోంలో నామినేషన్లు స్వీకరిస్తారు. 25వ తేదీన ఏపీఎన్జీవో ఎన్నికలు జరుగనున్నాయి.
ఏపీఎన్జీవో తాత్కాలిక అధ్యక్షుడు అశోక్ బాబు ఉద్యోగుల సమస్యలను పక్కన పెట్టి రాజకీయాలు చేస్తున్నారని ఎనిమిది జిల్లాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలకు సంబంధించి అధ్యక్షునిగా ఎవరికి ఓటు వేయాలన్న అంశంపై ఇవాళ వారు సమావేశమై చర్చించారు. ఈ నేపథ్యంలో ఉద్యోగుల అసంతృప్తి, ఆగ్రహాలను తట్టుకుని అశోక్ బాబు నిలబడతారా...? మళ్లీ అధ్యక్ష పగ్గాలను అందుకుంటారా? అన్నది తెలియాలంటే మరో పక్షం రోజులు వేచి చూడాల్సిందే.