: థాయ్ మాజీ ప్రధానిపై హత్యానేరం నమోదు


థాయ్ లాండ్ మాజీ ప్రధాని, ప్రతిపక్ష డెమోక్రాట్ పార్టీ నేత అభిసిత్ వెజాజివాపై హత్యానేరం నమోదైంది. 2010లో జరిగిన అల్లర్లలో 90 మంది వరకు మరణించారు. దీంతో ఆయనపై ఈ అభియోగాలు నమోదయ్యాయి. అయితే ఈ అభియోగాలను అభిసిత్ తోసిపుచ్చారు. కాగా న్యాయస్థానం ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం థాయ్ లాండ్ లో అల్లర్లు మళ్లీ చెలరేగుతున్నాయి. ప్రధాని ఇంగ్లక్ షినవ్రతను గద్దె దిగాలంటూ ఆందోళనకారులు విధ్వంసాలకు దిగుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఆరోపణలు రావడం కక్షసాధింపు చర్యగా పలువురు పేర్కొంటున్నారు.

  • Loading...

More Telugu News