: సవాల్ విసిరినా కేసీఆర్ కిమ్మనకుండా పడుకున్నారు: నారా లోకేష్


దొంగపుత్రుడు, దత్తపుత్రుడిని చూసుకొని కాంగ్రెస్ పార్టీ విర్రవీగుతోందని టీడీపీ అధినేత చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి మొత్తం తెలుగుదేశం హయాంలోనే జరిగిందని అన్నారు. ఈ రోజు ఎన్టీఆర్ ట్రస్టు భవన్ లో జరిగిన టీఎన్ఎన్ఎఫ్ సమావేశంలో లోకేష్ ప్రసంగించారు. ఏ విషయంపైనైనా చర్చకు సిద్ధమని తమ అధినేత చంద్రబాబు సవాల్ విసిరినా... కేసీఆర్ ఇంకా పడుకునే ఉన్నారని విమర్శించారు. ఏ రోజైనా కేసీఆర్ బయ్యారం గనులపై మాట్లాడారా? అంటూ ప్రశ్నించారు. ఉద్యోగుల కోసం కేసీఆర్ ఏనాడూ పోరాటం చేయలేదని విమర్శించారు. బాబ్లీ డ్యాం నిర్మాణానికి వ్యతిరేకంగా కేసీఆర్ ఏనాడూ పోరాడలేదని లోకేష్ తెలిపారు. వైయస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తమ నాయకుడు చంద్రబాబుపై ఎన్నో కేసులు పెట్టారని... వాటన్నింటిలో ఆయన నిర్దోషిగా బయటపడ్డారని చెప్పారు. కేవలం 39 ఇంజినీరింగ్ కాలేజీలు మాత్రమే ఉండే రాష్ట్రంలో చంద్రబాబు 600 కాలేజీలు ఏర్పాటు చేశారని అన్నారు.

  • Loading...

More Telugu News