: ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు నిరాకరించిన బీజేపీ


అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని... అన్న చందంగా ఉంది ఢిల్లీలో ప్రస్తుత పరిస్థితి. అసెంబ్లీ ఎన్నికలు పూర్తైనా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటయ్యే పరిస్థితి లేకుండా పోయింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో 70 సీట్లకు గానూ బీజేపీ 32 సీట్లు దక్కించుకుంది. దాంతో, సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయలేని పరిస్థితి నెలకొంది. మరోవైపు 28 సీట్లు దక్కించుకున్న కొత్త పార్టీ ఏఏపీ మద్దతు ఇవ్వనని స్పష్టం చేయడంతో పాటు మరోసారి ఎన్నికలకు సై అంటోంది. ఈ క్రమంలో ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటూ లెఫ్టినెంట్ గవర్నర్ ఆహ్వానిస్తే... బీజేపీ నిరాకరించింది. తాము మళ్లీ ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు విజయ్ గోయెల్ తెలిపారు. ఇదంతా చూస్తుంటే ఢిల్లీలో రాష్ట్రపతి పాలన తప్పదా? అని అనిపిస్తోంది.

  • Loading...

More Telugu News