: హైదరాబాదులో బొత్స ఇంటికి వెళ్లిన దిగ్విజయ్


హైదరాబాదు పర్యటనలో ఉన్న రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ కొంతసేపటి కిందట పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ ఇంటికి వెళ్లారు. అనారోగ్యం కారణంగా కొన్ని రోజులు కేర్ ఆసుపత్రిలో చికిత్స పొంది ఇప్పుడిప్పుడే కోలుకుంటన్న ఆయనను దిగ్విజయ్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితులపై కూడా ప్రత్యేకంగా చర్చించినట్లు తెలుస్తోంది. మంత్రుల నివాస ప్రాంగణంలోని ఆయన ఇంటికి వచ్చిన దిగ్విజయ్ ను బొత్స స్వయంగా ఇంట్లోకి ఆహ్వానించారు.

  • Loading...

More Telugu News