: ప్రభుత్వం ఏర్పాటు చేయండి.. బీజేపీని ఆహ్వానించిన ఢిల్లీ గవర్నర్
దేశ రాజధానిలో నెలకొన్న రాజకీయ సంక్షోభానికి తెరదించేందుకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ రంగంలోకి దిగారు. విధాన సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుచుకున్న బీజేపీని ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా సూచిస్తూ ఆహ్వానం పంపారు. అయితే ఢిల్లీ బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి హర్షవర్ధన్, ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వెళ్లారు. ఈ సాయంత్రానికి ఆయన ఢిల్లీ చేరుకునే అవకాశం ఉండడంతో... అప్పుడు వెళ్లి లెఫ్టినెంట్ గవర్నర్ ను కలుస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. దీంతో ఢిల్లీ అధికార పీఠంపై ఉత్కంఠ ముగిసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.