: మందు తాగి బండి నడిపినందుకు మూడు రోజుల జైలు శిక్ష
హైదరాబాద్ నగరంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టిన పోలీసులు మందుబాబులను అదుపులోకి తీసుకున్నారు. మద్యం తాగి వాహనం నడుపుతున్న వారిపై కేసులు నమోదు చేశారు. ఇవాళ పోలీసులు వారిని ఎర్రమంజిల్ కోర్టులో హాజరుపరిచారు. కేసును విచారించిన కోర్టు 23 మందికి మూడు రోజుల జైలు శిక్ష విధించింది.