: మూడు గంటలకు మరోసారి సమావేశమౌతాం: శైలజానాథ్


సీఎల్పీ కార్యాలయంలో మంత్రి శైలజానాథ్, మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి, గాదె వెంకటరెడ్డి భేటీ ముగిసింది. మధ్యాహ్నం మూడు గంటలకు మరోసారి సమావేశమవుతామని శైలజానాధ్ తెలిపారు. తెలంగాణ ముసాయిదా బిల్లు అసెంబ్లీలో చర్చకు వస్తే తమ ప్రాంతానికి జరిగిన అన్యాయాన్ని, తమ బాధను చెప్పుకుంటామని జేసీ తెలిపారు. కాగా పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించామన్నారు. మరిన్ని అంశాలపై స్పష్టత రావాల్సి ఉందని, అందువల్లే తాము గంట సేపటి తరువాత మళ్లీ సమావేశమవుతామని శైలజానాథ్ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News