: సీఎల్పీ కార్యాలయంలో సీమాంధ్ర కాంగ్రెస్ నేతల భేటీ
సీఎల్పీ కార్యాలయంలో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ నేతలు సమావేశమయ్యారు. తెలంగాణ ముసాయిదా బిల్లు అసెంబ్లీలో చర్చకు వస్తే ఏం చేయాలన్న విషయంపై ఎమ్మెల్యేలు గాదె వెంకటరెడ్డి, జేసీ దివాకర్ రెడ్డి, ఉగ్ర నరసింహారెడ్డి తదితరులు చర్చిస్తున్నారు. తెలంగాణ ముసాయిదా బిల్లుపై తమ అభిప్రాయాన్ని దిగ్విజయ్ సింగ్ కెలా తెలపాలన్న విషయంపై చర్చ జరుగుతోందని తెలుస్తోంది.