: స్వలింగ సంపర్కం తీర్పుపై సోనియా, కపిల్ సిబాల్ స్పందన
భారతీయ శిక్షా స్మృతిలోని 377 సెక్షన్ (అసహజ నేరాలు) కింద స్వలింగ సంపర్కం నేరమంటూ దేశ సర్వోన్నత న్యాయస్థానం వెలువరించిన తీర్పుపై తీవ్ర అసంతృప్తులు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ఆర్ధికమంత్రి చిదంబరం తన నిరసన వ్యక్తం చేశారు. తాజాగా కాంగ్రెస్ అధినేత్రి, యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీ, కేంద్రమంత్రి కపిల్ సిబాల్ కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. స్వలింగ సంపర్కంపై సుప్రీం తీర్పుపై తీవ్ర నిరాశ చెందినట్లు ఓ ప్రకటన విడుదల చేశారు. పార్లమెంటులో ఈ సమస్యపై పరిష్కారం దొరకవచ్చన్న సోనియా.. రాజ్యాంగం జీవితానికి ఇచ్చిన దాన్ని సమర్ధిస్తారని ప్రకటనలో ఆశాభావం వ్యక్తం చేశారు.