: చర్చకు మేము రెడీ.. నువ్వు సిద్ధమా?: కేసీఆర్ కు ఎర్రబెల్లి సవాల్


కేసీఆర్ దొంగ దీక్ష వల్ల, హరీష్ రావు ఓవర్ యాక్షన్ వల్లే వేయి మంది విద్యార్థులు మరణించారని టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు ధ్వజమెత్తారు. హైదరాబాద్ ఎన్టీఆర్ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ చేపట్టిన దీక్ష మీద కానీ, కేసీఆర్ సంపాదించిన 60 ఎకరాల భూమి, ఆస్తుల మీద కానీ బహిరంగ చర్చకు ఎప్పుడంటే అప్పుడు, ఎక్కడంటే అక్కడ చర్చకు సిద్ధమని ఆయన సవాలు విసిరారు.

చంద్రబాబు నాయుడిని విమర్శించే ముందు కేసీఆర్ గత చరిత్ర చూసుకోవాలని ఎర్రబెల్లి సూచించారు. సిద్దిపేటలో యూత్ కాంగ్రెస్ నేతగా, ఎంపీగా ఏం చేశావో గుర్తు చేసుకోవాలన్నారు. మోసాలకు పాల్పడింది, నమ్మిన వారిని స్వలాభం కోసం నట్టేట ముంచింది నువ్వు కాదా? అని కేసీఆర్ ను ప్రశ్నించారు. తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి చేసింది కేవలం చంద్రబాబు నాయుడేనని ఆయన స్పష్టం చేశారు.

చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన విద్యావిధానం వల్లే తెలంగాణలో యువత విదేశాల్లో ఉద్యోగాలు సంపాదించారన్నారు. రాజధానిగా హైదరాబాదుని అభివృద్ధి చేసింది ఎవరో ప్రపంచానికి తెలుసని అన్నారు. కేవలం చంద్రబాబు నాయుడి వల్లే తెలంగాణ వ్యాప్తంగా సీసీ రోడ్లు, రవాణా సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయని ఆయన గుర్తు చేశారు.

  • Loading...

More Telugu News